ఓటిటి లో ట్రెండ్ అవుతోన్న “ఈగిల్”

ఓటిటి లో ట్రెండ్ అవుతోన్న “ఈగిల్”

Published on Mar 18, 2024 6:44 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఓటిటి లోకి కూడా అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అమేజాన్ ప్రైమ్ వీడియో మరియు ఈటీవీ విన్ లో ఈ చిత్రం డిజిటల్ గా అందుబాటులో ఉంది.

ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చి వారం దాటుతోంది. రెండో వారం కూడా సినిమా మంచి రెస్పాన్స్ తో ట్రెండ్ అవుతోంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి దావ్ జంద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు