శ్రవణ్ రాఘవేంద్ర, లియోనా లిషోయ్ హీరో హీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం’ఎదురీత’. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. జియా శర్మ, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, ‘రంగస్థలం’ మహేష్, కాశి విశ్వనాథ్, రవిప్రకాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
దర్శకుడు బాలమురుగన్ మాట్లాడుతూ ఓ 40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడు అంటే అమితమైన ప్రేమ. కుమారుడు కోరినది ఏదీ కాదనకుండా ఇస్తాడు. కుమారుడి ప్రతి కోరిక నెరవేరుస్తాడు. ఆ ప్రేమ అతడికి ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది? అనేది తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలన్నారు.
నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాలమురుగన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. కుమారుడి కోసం కన్నతండ్రి సాగించిన ఎదురీత ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.


