‘సూపర్ స్టార్’తో షూట్ లో పాల్గొనబోతున్న ‘తెలుగు హీరోయిన్’ !

Published on Oct 6, 2018 2:07 pm IST

ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’ మరియు ఇటీవలే వచ్చిన బ్రాండ్ బాబు చిత్రాలతో ఆకట్టుకున్న ఈషా.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రంలో నటిస్తోంది.

కాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చిత్రంలో కూడా ఈషా నటించబోతున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాత్ర కాలేజీ లెక్చరర్ అని తెలుస్తోంది. ఈ నెలాఖర్లో ఈషా షూట్ లో పాల్గొనబోతుందట. శివరాజ్ కుమార్ కు ఆమెకు మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

లక్కీ గోపాల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత కిరణ్ కుమార్ నిర్మించనున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ‘అజనీష్.బి.లోకనాథ్’ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :