మరో బాక్సింగ్ మూవీ కోసం రెడీగా ఉండండి!

Published on Jul 16, 2021 11:26 pm IST

‘ఈ నగరానికి ఏమైంది’ ఫేం సాయి సుశాంత్‌ రెడ్డి హీరోగా, రోహిత్‌ తంజావూర్‌ దర్శకత్వంలో ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.3గా బాక్సింగ్ నేపధ్యంలో ఓ మూవీ తెరకెక్కబోతుంది. దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో సాయి సుశాంత్ బాక్సింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. అంతేకాదు బాక్సర్‌గా కనిపించేందుకు అతను ఎంతలా కష్టపడుతున్నాడో కూడా ఇందులో చూడొచ్చు.

ఇది ఎల్బీ స్టేడియం.. ఇక్కడ నెలాఖరుకు రూ.300 కడితే సరిపోతుంది.. నెల మొత్తం రక్తం గూడగట్టాలి.. అట్లాంటోల్లనే ఇక్కడకు రానిస్తారు.. అట్లాంటొల్లే ఇక్కడ రాణించగలుగుతారు.. అంటూ వాయిస్ ఓవర్‌తో సాగిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో సాయి సుశాంత్‌ రెడ్డి భైరవ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రమోద్‌ కుమార్‌, నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :