సినిమా నిర్మాణములోకి ఎలైట్ గ్రూప్.

Published on Feb 17, 2020 9:26 pm IST

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఎలైట్ గ్రూప్ నిర్మాణంలో ‘రాజా వారు రాణి గారు’ ఫేం కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సీవాలా భామ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో ఇటీవలే ముహూర్తం కార్యక్రామాన్ని జరుపుకుని షూటింగ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్స్, రెస్టారెంట్స్ వంటి పలు రంగాల్లో పేరుగాంచిన ఈ సంస్థ ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి తమ మొదటి అడుగు వేయనుండడంతో ‘ ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ ఓపెనింగ్ కార్యక్రామాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇదే కార్యక్రమంలో పటాన్ చెరువు ఎమ్ ఎల్ ఏ గూడెం మహిపాల్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్ ఎల్ ఏ దాష్యం వినయ్ భాస్కర్ గార్ల చేతుల మీదుగా వీరి నుంచి రానున్న కొత్త వెంచర్ ఎలైట్ ట్రెండ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ” మేము ఇప్పటివరకు చేసిన అన్ని రంగాల్లో నాణ్యతను కాపాడుకుంటూ ఎదిగాం, అలాగే సినీ రంగంలో కూడా ఆ నాణ్యతను వంద శాతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. యంగ్ టాలెంట్, మంచి కథలకి ఎల్లప్పుడూ మా నిర్మాణ సంస్థ అందుబాటులో ఉంటుంది” అని చైర్మన్ ప్రమోద్, మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన క్రికెటర్ వెంకటపతి రాజు గారి చేతుల మీదుగా వీరిచే ఇటీవలే నిర్వహించబడిన ఎలైట్ ప్రీమియర్స్ లీగ్ విన్నర్స్ కి ట్రోఫీలు ఇవ్వడం జరిగింది.

” రెండవ సినిమా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఈ నెల చివరలో షూటింగ్ మొదలు పెడ్తున్నాం” అని కిరణ్ వ్యాఖ్యానించగా ” టాక్సీవాలా తర్వాత సంవత్సరం గ్యాప్ తీస్కుని కథ, క్యారక్టర్ చాలా బాగా నచ్చడంతో వెంటనే ఇది నేను చేసెయ్యాలి అని ఫిక్స్ అయ్యా” అని హీరోయిన్ ప్రియాంక చెప్పింది.

ఈ కార్యక్రమంలో పార్ట్నర్స్ సిద్దారెడ్డి, విశ్వనాధ్ మరియు శంకర్ గార్లు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :

X
More