అల్లు అర్జున్ సినిమా అనగానే ఒప్పేసుకున్నానంటున్న హీరోయిన్ !

బాలీవుడ్ హీరోయిన్ ఎల్లి అవ్రమ్ అల్లు అర్జున్ యొక్క తాజా చిత్రం ‘నా పేరు సూర్య’లో ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్న సంగతి తెలిసిందే. తెలుగునాట ఆమెకు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. దీని గురించి మాట్లాడిన ఆమె అల్లు అర్జున్ చాలా పాపులర్ హీరో. ఆయన సినిమాలో పాట అనగానే ఇక ఏ వివరాలు అడగకుండా చేయడానికి ఒప్పేసుకున్నాను.

నేను ఆయన అభిమానినే. ఆయన డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటల్లో ‘సీటీ మార్’ నాకు బాగా నచ్చుతుంది. నేను చేయబోయే పాట భిన్నంగా, విలువలతో కూడినదిగా ఉంటుంది. అందులో అల్లు అర్జున్ పెద్దగా డాన్స్ చేయరు అన్నారు. ప్రస్తుతం ఈమె హిందీ ‘క్వీన్’ యొక్క తమిళ, కన్నడ రీమేక్స్ లో నటిస్తోంది. ఇకపోతే వక్కంతం వంశీ రూపొందిస్తున్న ‘ఈ నా పేరు సూర్య’ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకురానుంది.