‘విరూపాక్ష’లో జాక్వెలిన్ ట్రాక్ ?

Published on Jul 12, 2020 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రంలో ఆమె యువరాణిగా కనిపిస్తుందట. ఆమె పాత్ర సెకెండ్ హాఫ్ లో చనిపోతుందని, ఆమె చనిపోయే ఎమోషనల్ సీక్వెన్స్ సినిమాలోనే కీలకం అని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.

అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఓ చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పీవీపీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని సినిమా చేయడానికి పవన్ నుండి కూడా సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయట.

సంబంధిత సమాచారం :

More