ఆర్య, విశాల్ ల “ఎనిమి” టీజర్ జులై 24 న విడుదల!

Published on Jul 23, 2021 5:00 pm IST

ఆర్య, విశాల్, మృణాళిని రవి, మమత మోహన్ దాస్, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ఎనిమి. ఆనంద్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ జులై 24 వ తేదీన విడుదల కి సిద్దం అయింది. ఈ చిత్రం టీజర్ ను జులై 24 న సాయంత్రం ఆరు గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. అయితే ఈ విషయాన్ని తమిళ నటుడు ఆర్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆర్. డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :