10 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఆర్య, విశాల్ ల “ఎనిమి టీజర్”

Published on Jul 26, 2021 7:03 pm IST

విశాల్, ఆర్య లు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ఎనిమి. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయింది. తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయిన ఈ టీజర్ సర్వత్రా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టీజర్ విడుదల అయిన ఒక్క రోజే 10 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకొని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ టీజర్ భారీ వ్యూస్ సొంతం చేసుకోవడం పట్ల ఆర్య మరియు విశాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ అవ్వడం మాత్రమే కాకుండా ఇంకా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :