ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఎనిమీ” టీజర్ రిలీజ్..!

Published on Jul 24, 2021 10:06 pm IST


తమిళ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఎనిమీ”. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తంబి రామయ్య, కరుణాకరన్, మృణాళిని రవి, మమత మోహన్ దాస్, ప్రకాష్ రాజ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంకి సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్‌ని చూస్తుంటే పూర్తి యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా? నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే? అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు థమన్, శామ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :