‘రాములో రాములా… ‘ 45 మిలియన్ల ప్లస్ వ్యూస్‌ !

Published on Nov 12, 2019 5:07 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి దీపావళి సందర్భంగా విడుదలైన ‘రాములో రాములా… ‘ సాంగ్ మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ మొత్తానికి ట్రెండ్‌ ను క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌ లో 45 మిలియన్ల వ్యూస్‌ తో దూసుకుపోతుంది. అలాగే టిక్‌ టాక్‌ లోనూ బాగానే ప్రభావం చూపిస్తోంది ఈ సాంగ్. శ్యాం కాసర్ల రాసిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారు.

ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. మరి ఈ సారి ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More