ఎంత మంచివాడవురా ఎంత రాబట్టాడు..?

Published on Jan 16, 2020 12:21 pm IST

సంక్రాంతి బరిలో చివరిగా దిగిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్.ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం పట్ల సానుకూలంగానే స్పందించారు. కాగా ఎంత మంచివాడవురా చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆంధ్ర మరియు తెలంగాణా లలో కలిపి ఈ చిత్రం 4 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ ఇమేజ్ దృష్ట్యా ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లే అని చెప్పవచ్చు

నేడు కనుమ కావడం, రేపటి నుండి వీకెండ్ మొదలు కావడంతో పాటు ప్రేక్షకులు సంక్రాంతి మూడ్ లోనే ఉంటారు కాబట్టి మరి కొంత మెరుగైన వసూళ్లు దక్కించుకొనే అవకాశం కలదు. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రంతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఉమేష్ గుప్తా, శుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రిన్ ఎంత మంచివాడవురా చిత్రంలో హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More