ఈరోస్ బ్యానర్ లో బాలయ్య 99వ సినిమా

ఈరోస్ బ్యానర్ లో బాలయ్య 99వ సినిమా

Published on Feb 1, 2015 7:48 PM IST

balakrishna1
నందమూరి బాలకృష్ణ ప్రజలు ఎన్నుకున్న ప్రజా నాయకుడిగా తమ విధులను సమర్దవంతంగా నిర్వహిస్తూనే, తనను అభిమానించే అభిమానుల కోసం కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అటు ప్రజా పరిపాలని, ఇటు సినిమాలకి పగడ్బందీగా సమయం కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 98వ సినిమా ‘లయన్’ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తి కాకముందే ఆతన తన తన 99వ సినిమాకి రంగం సిద్దం చేసుకుంటున్నాడు.

ఇప్పటికే కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి రాసిన కథకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత సంవత్సరం లౌక్యం సినిమాతో హిట్ అందుకున్న శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఇండియాలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఈ సినిమా ప్రొడక్షన్ టీం లో ఎంటర్ అయ్యారు. ఇప్పటి వరకూ తెలుగులో పూర్తి నిర్మాణ బాధ్యతలు చేపట్టని ఈ సంస్థ ఎవరైనా నిర్మాతతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుందా లేక సోలోగా నిర్మిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ రోస్ లాంటి సంస్థ తెలుగులో స్టార్ హీరోల సినిమాల ప్రొడక్షన్ లో భాగం కావడం టాలీవుడ్ కి శుభసూచకం అని చెప్పాలి.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ సినిమాని ఫిబ్రవరి చివర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. శ్రీవాస్ బాలకృష్ణని కొత్తగా చూపించేలా డిజైన్ చేసుకుంటున్నాడు. మరో వైపు బాలకృష్ణ కూడా ఈ సినిమా లుక్ మరియు గెటప్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

తాజా వార్తలు