యూరప్ కు బయలుదేరబోతున్న పవన్
Published on Oct 7, 2017 4:45 pm IST


పవన్- త్రివిక్రమ్ ల చిత్ర కొత్త షెడ్యూల్ యూరప్ లో జరగనుందని మేము ఇదివరకే తెలియ పరిచాము. వచ్చే వారమే యూరప్ లో ఈచిత్ర షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది.

ఈ షూట్ లో హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.

 
Like us on Facebook