ఇండియన్ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్ళడం కోసం ఎస్ఎస్ రాజమౌళి గత రెండేళ్లుగా ఎంతో శ్రమించి తీసిన ప్రతిష్టాత్మక పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’.ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్స్ ఎఫెక్ట్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ లో డైరెక్టర్ గా, నిర్మాతగా, సక్సెఫుల్ రియాలిటీ షో హోస్ట్ గా, తాజాగా నటుడిగా మారిన కరణ్ జోహార్ బాహుబలి హిందీ వెర్షన్ కి సమర్పకుడిగా వ్యవరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
కరణ్ జోహార్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ‘బాహుబలి అనే విజువల్ వండర్ కోసం రాజమౌళి చాల కష్టపడుతున్నాడు. ఇండియాలోనే అత్యంట్ భారీ బడ్జెట్ తో, గ్రాండ్ విజువల్స్ తో రూపొందిన ఈ సినిమాని నేను ప్రెజంట్ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. ఒక సింగిల్ ప్రాజెక్ట్ కోసం బాహుబలి 4 సంవత్సరాలు స్పెండ్ చేసి తీసినందుకు ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూడాలని’ అన్నాడు. ఈ నెల 31న జరగనున్న బాహుబలి ట్రైలర్ మరియు ఆడియో లాంచ్ కి కరణ్ జోహార్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు.
ట్రైలర్ రిలీజ్ లోపు ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో రోజు మార్చి రోజు ఈ చిత్ర టీం నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తోంది. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసి జూలై 10న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు


