అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఎన్టీఆర్ లుక్ !

26th, March 2017 - 09:33:47 AM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు బాబీ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఒకేసారి జూనియర్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తుండటంతో ఆ గెటప్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తింది. ఆ ఆసక్తిని ఉత్కంఠగా మారుస్తూ నిన్న ఎన్టీఆర్ ధరించనున్న ఒక లుక్ యొక్క కృత్రిమ ఫేస్ మాస్క్ బయటికొచ్చింది.

ఏమాత్రం తేడా లేకుండా అచ్చు ఎన్టీఆర్ ను పోలి ఉన్న ఆ మాస్క్ ను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. హాలీవుడ్ లో పేరు మోసిన కృత్రిమ అవయవాల సృష్టికర్త, మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ ఈ కృతిమ పేస్ మాస్క్ ను రూపొందించారు. ఈయన ‘లార్డ్ అఫ్ ది రింగ్స్, లైఫ్ అఫ్ పై, ఐరన్ మాన్’ వంటి సినిమాలకు పనిచేశారు. ఒక లుక్ ను చూసిన తర్వాతా ఒక్క గెటప్ నే ఇంత గొప్పగా డిజైన్ చేస్తే మిగతా లుక్స్ ను ఎలా చేసుంటారో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో రిలీజ్ చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు.