ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం లొకేషన్స్ చూస్తున్న రాజమౌళి !

Published on Aug 5, 2018 9:47 am IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండే రకరకాల ఊహా గానాలు వినిపిస్తున్నాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం భారీ సెట్‌ నిర్మించాలట. ఆ సెట్ నిర్మించటానికి అనువైన ప్లేస్ కోసం కెమెరామెన్‌ సెంథిల్‌ కుమార్‌ తో కలిసి రాజమౌళి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లొకేషన్స్‌ సెర్చ్‌ చేస్తున్నారని తెలుస్తోంది, అయితే గతంలోనే హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరు గ్రామ పరిసర ప్రాంతాలను టీమ్‌ పరిశీలించారు.

కాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగనుందని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న భారీ సెట్ల నిర్మాణాలు అన్ని బ్రిటీష్‌ నేపధ్యానికి, అప్పటి వాతావరణానికి సంబంధించినవే, ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివే నట.

‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్ర షూటింగ్ లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్ పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అవనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More