ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ: సత్య దేవ్- చిరంజీవి గారి ప్రభావం తోనే..!

Published on Jul 4, 2020 4:30 pm IST

మంచి నటుడిగా పేరున్న సత్యదేవ్ నుండి ఈ మధ్య 47డేస్ మూవీ రావడం జరిగింది. అలాగే ఆయన నెక్స్ట్ మూవీ ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య కొద్దిరోజులలో ఓ టి టి లో విడుదల కానుంది. నేడు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ విశేషాలు మీ కోసం…

 

నటుడుగా ఎలా మారారు?

నన్ను ఈ ప్రొఫెషన్ వైపు నడిపించిన విషయం ఏమిటో నాకు తెలియదు. కానీ చిరంజీవి గారి ప్రభావం ఉందని చెప్పగలను..మీరు నమ్మరు గానీ చిన్నప్పుడు చిరంజీవి పాట వినకపోతే నేను అన్నం కూడా తినేవాడిని కాదని అమ్మ చెప్పింది. నాకు ఊహ వచ్చినప్పటినుండి నటుడవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాను.

 

మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ?

మాది వైజాగ్, ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నాన్న మీడియాలో పనిచేస్తారు. ఇక అమ్మ హౌస్ వైఫ్.

 

మీరు పెద్దగా వార్తలలో ఉండరు, కారణం?

చాల మంది ఇదే అంటుంటారు.. అలాగే నాకు కూడా ఈ విషయం గురించి శ్రద్ద పెట్టాలి అనిపిస్తుంది. చూద్దాం…

 

నటుడిగా ఎదగడానికి ఇబ్బందులు పడ్డారా?

 

నటుడు కావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమా కోసం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నీ వదిలేసి దీనినే లక్ష్యంగా పెట్టుకున్నాను. బ్లఫ్ మాస్టర్ సినిమా వరకు నైట్ షిఫ్ట్ జాబ్ చేసి, ఉదయం షూటింగ్స్ లో పాల్గొనేవాడిని.

 

ఓ టి టి వైపు వెళ్ళడానికి కారణం?

 

ఆ కథలు నన్ను వెబ్ సిరీస్ లు ఒప్పుకొనేలా చేశాయి. గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ వెబ్ సిరీస్ లు మీరు చూస్తే అర్థం అవుతుంది. అవి బలమైన కథలతో తెరకెక్కినవి అని .

 

మీరు నటించిన రెండు చిత్రాలు ఓ టి టి లో విడుదల అవుతున్నాయి, ఎలా ఫీలవుతున్నారు?

 

నిజానికి నా సినిమాలు వెండితెరపై విడుదల అవ్వాలి, ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఆశ ఉంది. కానీ ఇప్పుడు మనం కఠిన పరిస్థితులలో ఉన్నాం. నిర్మాతకు మంచి జరగాలంటే తప్పదు.

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటీ?

ప్రస్తుతం స్కై ల్యాబ్ అని ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాను. ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న పవర్ పేట మూవీలో కూడా ఓ కీలక రోల్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ త్వరలో ప్రకటిస్తాను.

సంబంధిత సమాచారం :

More