ఇంటర్వ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ-కృష్ణ అండ్ హిజ్ లీల కి సీక్వెల్ చేస్తాను..!

Published on Jun 27, 2020 4:52 pm IST

రానా దగ్గుబాటి నిర్మాతగా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన రొమాంటిక్ డ్రామా కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. దీనితో ఈ మూవీలో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి ఈ యంగ్ హీరో కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ గురించి చెప్పిన సంగతులేందో చూద్దామా..

మూవీకి వస్తున్న స్పందన ఎలా ఉంది?
అధ్బుత రెస్పాన్స్ వస్తుంది. రోజు రోజుకు ఈ మూవీ గురించి మాట్లాడుకొనే వారి సంఖ్య పెరిగిపోతుంది. మా టార్గెటెడ్ ఆడియన్స్ ని చేరుకున్నాము.

ఈ మూవీలో మీది కొంచెం క్లిష్టమైన పాత్ర…ఎలా చేశారు?

అవును ఇద్దరు అమ్మాయిలను ప్రేమించే యువకుడిగా నాది చాలా క్లిష్టమైన పాత్ర. ఇద్దరు అమ్మలతో రిలేషన్ షిప్ ఉన్నందున నేను వారిని నేను మోసం చేస్తున్నాను అన్న భావన ప్రేక్షకులకు రాకూడదు. దానిని బాలన్స్ చేయడం చాలా కష్టమైన అంశం. మొదటి ఇబ్బందిపడినా తరువాత తేలికగా చేసేశాను.

ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి కారణం?
దాదాపు నాలుగేళ్లు ఈ సినిమా విడుదల కావడానికి సమయం పట్టింది. దానికి చాలా కారణాలున్నాయి. ఎలా అయితేనేమి మేము అనుకున్నట్లుగా సినిమా విడుదల చేయగలిగాం. అనుకున్నది సాధించాం.. ఇప్పుడు హ్యాపీ.

దర్శకుడు రవికాంత్ తో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
రవికాంత్ నేను పదేళ్లుగా మిత్రులం. చాల కాలం ఒకే పార్ట్మెంట్ లో ఉన్నాం. ఈ సినిమా విషయంలో అనేక విషయాలలో ఇద్దరం కలిసి పనిచేశాం. రవికాంత్ ఈ సినిమాను అధ్బుతంగా తెరకెక్కించాడు. తన వర్క్ నాకు మంచి సంతృప్తిని ఇచ్చింది.

మీరు పెద్దగా ప్రచారం కోరుకోరు ఎందుకు?
మొదటి నుండి నేను చాల సైలెంట్ పర్సన్. ఐతే మీడియాతో ఇంటరాక్ట్ అవడానికి ఇదే మంచి సమయం అన్న ఆలోచన ఉంది. నిజంగా చెప్పాలంటే..మన సినిమా బాగుంటే మన గురించి నలుగురు చెప్పుకుంటారు. మన గురించి మనం హంగామా చేసుకోవాల్సిన అవసరం లేదు.

డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా?
ప్రస్తుతానికి లేదు, ఐతే నేను వర్క్ చేసే సినిమాలలో రైటర్ గా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. భవిష్యత్తులో చేసే ఆలోచన ఉంది.

మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటీ?
మా వింత గాధ వినుమా అనే ఓ చిత్రం చేస్తున్నాను. అందులో సీరత్ కపూర్ హీరోయిన్. అలాగే కృష్ణ అండ్ హిజ్ లీల సీక్వెల్ చేసే ఆలోచన ఉంది.

సంబంధిత సమాచారం :

More