ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: హైపర్ ఆది – ఏదేమైనా టీవీ కెరీర్‌ను వదిలిపెట్టను

Published on May 6, 2020 11:27 pm IST

లాక్‌డౌన్ ఇంటర్వ్యూను కొనసాగిస్తూ నేడు జబర్దస్త్ కమెడీయన్ హైపర్ ఆదిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అతనితో మాట్లాడుతూ ఆయన ప్యూచర్ ప్లాన్స్, పవన్ కళ్యాణ్‌తో ఆయనుకున్న అనుబంధం, అతగాడి సామాజిక సేవ, అతని పంచ్ లైన్‌లకు ప్రేరణ, చిరంజీవి నుండి ఆయన అందుకున్న ప్రశంసలు ఇలాంటివి మరెన్నో విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

లాక్‌డౌన్ సమయంలో మీరు ఏం చేస్తున్నారు?

లాక్‌డౌన్ ప్రకటించడానికి ఒక రోజు ముందు నేను నా స్వస్థలమైన ఒంగోల్‌కి వచ్చి నా కుటుంబంతో సమయం గడుపుతున్నాని అన్నారు. ఇది కాకుండా ప్రస్తుతం నేను ముందు ముందు చేయబోయే స్క్రిప్ట్‌లపై పని చేస్తున్నానని అంతేకాకుండా నా డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం కూడా స్క్రిప్ట్‌లను సిద్ధం చేసుకుంటున్నానని తెలిపాడు.

మీరు భవిష్యత్తులో దర్శకుడిగా మారాలని ఆలోచిస్తున్నారా?
రచన నాలో అంతర్నిర్మిత ప్రతిభ అని నేను భావిస్తున్నానని, ఒక చలన చిత్రానికి పూర్తి స్థాయి స్క్రిప్ట్ రాయాలనేది నా కల అని తెలిపాడు. అయితే నేను చాలా చిత్రాలకు సన్నివేశాలు వ్రాస్తున్నానని, నేను పూర్తి స్క్రిప్ట్ రాయగలనని అన్నాడు. అయితే నా మైండ్‌లో కొన్ని ఐడియాలు ఉన్నాయని ఈ లాక్‌డౌన్ సమయంలో దానిపై పని చేస్తున్నానని అన్నాడు.

మీ జీవితంలో మీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు?

నేను ఓ సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చాను. నేను బీటెక్ చేశానని అయినా సినిమాలలోకి రావాలని కోరుకున్నానని తెలిపాడు. నేను ఈ విషయాన్ని నా సన్నిహితుల దగ్గర చెప్పినప్పుడు వారు నన్ను చూసి నవ్వారని అది నన్ను చాలా బాధించిందని అన్నారు. అయితే అప్పుడే నేనేంటి అనేది ఈ ప్రపంచానికి నిరూపించాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ జబర్దస్త్ ద్వారా నాకు ఓ గుర్తింపు వచ్చిన రెండేళ్ళ తర్వాత మా ఊరికి వెళ్ళానని నేను అక్కడ దిగినప్పుడు నాకు అక్కడ అందిన గౌరవ, మర్యాదలు ఇంకా గుర్తున్నాయని ఆనాడు నన్ను అభినందించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుంపులుగా వచ్చారు. అది నాకు చాలా గర్వంగా అనిపించిందని చెపుకొచ్చాడు.

మీ జీవితంలో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ .. అది ఎప్పుడొచ్చిందో గుర్తుందా?

ఓ రోజు నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నానని, చిరంజీవి గారు MEC TV షో షూటింగ్ కోసం వచ్చినట్టు తెలిసిందని ఆ రోజు నేను ఏదో ఒకవిధంగా ఆయనను కలవాలని అనుకున్నానని చెప్పాడు. అయితే అక్కడి నుంచి చిరంజీవి గారు బయలుదేరుతున్నప్పుడు అతని కారు ముందు కుడివైపుకి వెళ్ళి అభిమానిలా చూస్తూ నిలబడ్డానని అప్పుడే చిరంజీవి గారు నన్ను చూసి కారు దిగి మరీ నన్ను కౌగిలించుకుని “నేను మీ ఎపిసోడ్‌లన్ని చూస్తానని మరియు మీ యొక్క పనితనాన్ని ప్రేమిస్తున్నానని చెబుతూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడని అది నా జీవితంలో అతి పెద్ద క్షణం, అది నేను ఎన్నటికి మరచిపోలేనని గుర్తు చేసుకున్నాడు.

విక్టరీ వెంకటేష్ వంటి నటుడితో కలిసి పనిచేస్తున్నారా?

ఇటీవల సురేష్ బాబు గారి నుండి నాకు కాల్ వచ్చిందని, నన్ను తన స్టూడియోలో కలవమని చెప్పారని అన్నాడు. అయితే నేను అక్కడికి వెళ్ళిన క్షణం విక్టరీ వెంకటేష్ గారిని చూసి షాక్ అయ్యానని అన్నాడు. అతను దాదాపు రెండు గంటలు నాతో మాట్లాడడని నా పనిని కూడా మెచ్చుకున్నాడని అన్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో అతను నన్ను పిలిచి నా గురించి మరియు నా కుటుంబం గురించి అడగడం చాలా బాగా అనిపించిందని, ఇది కూడా నాకు మరో చిరస్మరణీయ క్షణం అని తెలిపాడు.

మీరు సినిమాల్లోకి రావడానికి గల ప్రేరణ?

మహేశ్ బాబు అతడు సినిమాలో సీనియర్ కమెడీయన్ బ్రహ్మనందం ఎంట్రీ ఇచ్చిన క్షణాన్ని గుర్తు చేసుకుంటే అందులో అతడు చేసిన కొన్ని సన్నివేశాలు హిలేరియస్ పంచ్‌లుగా అనిపిస్తాయి. అయితే తాను ఆ చిత్రం నుండి ఎంతో ప్రేరణ పొందానని, ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలనే ఎక్కువగా ప్రేమిస్తారని అందుకే దానినే నా బలంగా చేకూర్చుకున్నానని ఆది తెలిపాడు.

కమెడీయన్ బ్రహ్మానందం గారితో మీ అనుబంధం?

ఒకసారి బ్రహ్మానందం గారు నన్ను తన ఇంటికి పిలిచాడు. నా స్కిట్స్‌లో కొన్నింటిని ఒకటికి మూడుసార్లు చూశాడు. నా స్కిట్ యొక్క ప్రతి అంశం గురించి ఆయన మాట్లాడాడు. ఇది నాకు చాలా సంతోషకరమైన క్షణం అని అన్నాడు.

మీ స్కిట్స్‌లోని పంచ్‌లను మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు?

ఆన్‌స్క్రీన్‌పై ఇది చాలా తేలికగా కనిపిస్తుంది కానీ తెర వెనుక చాలా పని ఉంటుందని ప్రారంభంలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం స్క్రిప్ట్ రాయడానికి మాకు ఒక వారం పట్టిందని చెప్పాడు. అయితే ప్రస్తుతం సొసైటీలో ట్రెండింగ్‌లో ఉన్న దానిని దృష్టిలో ఉంచుకుని నా స్క్రిప్ట్‌లను వ్రాస్తానని, మేము పంచ్‌లు రాయడం ప్రారంభించిన తర్వాత ఆటోమెటిక్‌గా ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయని అన్నాడు.

మీ స్కిట్స్ మహిళలను కించపరిచేలా ఉంటాయని కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి.. దీనికి మీరు ఏం చెబుతారు?

నిజంగా నా స్కిట్స్‌ను కుర్రాళ్ళ కంటే మహిళలే ఎక్కువగా ఇష్టపడుతారని నా అవుట్‌డోర్ షోలకు ఎవరైతే వచ్చి నన్ను కలుస్తారో వారికి ఇది బాగా తెలుసని అన్నారు. సమాజంలో ఏ ఒక్కరిని కానీ, ఏ స్త్రీని కానీ కించపరిచే విధంగా తాము ఏనాడు స్కిట్ చేయలేదని, మా హాస్యం ఆ క్షణం ఆ స్కిట్ యొక్క స్వభావంతో ముడిపడి ఉంటుందని చెప్పారు.

మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమాని కదా.. మీ బెస్ట్ మూమెంట్ ఏదైనా అతనితో పంచుకోవాలా?

గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో నేను భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశానని, నేను పార్టీ కోసం ఎలా పని చేస్తున్నానో ఆయనకు తెలుసని, అందుకే నన్ను చాలా మెచ్చుకుంటూ అలాగే కొనసాగించమని చెప్పారని, ఇదే నేను అతనితో పంచుకునే భావోద్వేగ క్షణం అని అన్నారు.

జబర్దస్త్‌తో మీకున్న అనుబంధం?

ఈ రోజు నేను ఏమైనా, ఏదైనా జబర్దస్త్ వల్లనే అని, నా ప్రతిభను నిరూపించుకోవడానికి మరియు దానిని అందరి ముందు ప్రదర్శించడానికి మల్లెమాల నాకు రెక్కలు ఇచ్చిందని అన్నాడు. నాకు ఎన్ని సినిమాలు ఛాన్స్ వచ్చినా, ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ మాత్రం జబర్దస్త్ వల్లనే అని అన్నాడు.

మీకు సినిమాల ద్వారా లాభదాయకం కనిపిస్తే టీవీ కెరిర్‌ని వదిలేస్తారా?

నేను ఒక విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని ఎలాంటి సందర్భాలలో కూడా తాను టీవీ కెరిర్‌ని వదిలేయనని అన్నారు. అయితే రానున్న కొద్ది రోజుల్లో టీవీ, ఒటిటి ప్లాట్‌ఫాంలే శాసించబోతున్నాయని టీవీ కళాకారులు వెండితెరపై పెద్దగా నిలదొక్కుకోలేరన్న వాస్తవాన్ని నేను నమ్మనని, చాలా చిత్రాల నుంచి నాకు మంచిగానే ఆఫర్లు వస్తున్నాయని అటు టీవీ, సినిమా రెండింటినీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నానని అన్నారు.

దీంతో హైపర్ ఆదితో మా ఇంటర్వ్యూ ముగిస్తూ, అతడికి మరింత మంచి కెరిర్ ఉండాలని ఆశిస్తున్నాము.

 

సంబంధిత సమాచారం :

X
More