తారక్ టీజర్ పై అంతకంతకు పెరుగుతున్న అంచనాలు.!

Published on Oct 20, 2020 9:00 am IST

యుంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నడూ లేని విధమైన ఆకలితో ఉన్నారు.. తమ అభిమాన హీరో టీజర్ ఎప్పుడు వస్తుందా సరికొత్త రికార్డులు ఎప్పుడు సృష్టిద్దామా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం” నుంచి భీం టీజర్ ఇంకో రెండు రోజుల్లో రానుంది. ముందు రామ్ చరణ్ కు తారక్ గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు చరణ్ తారక్ కు గిఫ్ట్ ఇవ్వనున్నాడు.

రామరాజు ఫర్ భీం గా రానున్న ఈ టీజర్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎన్నడూ లేని విధమైన అంచనాలను పెట్టుకున్నారు. పైగా RRR యూనిట్ కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తుండడంతో ఈ అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి తప్పితే ఏమాత్రం తగ్గడం లేదు. మరి జక్కన ఎలా ప్లాన్ చేశారా అని అక్టోబర్ 22 ఎప్పుడు వస్తుందా అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లోనే ఈ టీజర్ విడుదల కానుంది. మరి ఈ భారీ విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More