భారి గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమవుతున్న ‘యమలీల-2’

భారి గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమవుతున్న ‘యమలీల-2’

Published on Oct 24, 2014 10:30 AM IST

Yamaleea2

అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’ ఘన విజయం సాధించడమే కాకుండా క్లాసిక్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా కృష్ణారెడ్డి ‘యమలీల 2’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు ఒక నెల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. విస్తృతమైన గ్రాఫిక్ వర్క్స్ వలన సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. యమలోకం నేపధ్యంలో సాగే సన్నివేశాలకు గ్రాఫిక్స్ చేయడం కోసం చాలా సమయం పడుతుంది. పైగా మూవీ యూనిట్ గ్రాఫిక్ వర్క్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటుంది. సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారు.

‘యమలీల 2’ సినిమా ద్వారా కెవి సతీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సౌత్ ఆఫ్రికన్ మోడల్ దియా నికోలస్ హీరోయిన్ గా నటిస్తుంది. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు యముడిగా, కామెడీ కింగ్ బ్రహ్మానందం చిత్రగుప్తుడి పాత్రలలో నటిస్తున్నారు.

తాజా వార్తలు