ఈ వారం “ఎక్స్‌ట్రా జబర్దస్త్” మాములుగా ఉండదండోయ్..!

Published on Jul 20, 2021 1:01 am IST

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా అని అడగాగానే టక్కున గుర్తొచే పేర్లు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు బుల్లి తెరపై నంబర్‌వన్ కామెడీ ప్రోగ్రాంస్‌గా మంచి పేరు సంపాదించుకున్నాయి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఇందులో కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్, బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లు ఆద్యంతం నవ్వులు పూయించాయి.

ఇవి కాకుండా సుడిగాలి సుధీర్ మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు వచ్చిన మ్యాజిక్ ట్రిక్స్‌తో చేసిన అద్భుతమైన కామెడీ హిలేరియస్‌గా అనిపించింది. ఇవన్ని పక్కన పెడితే “30 వెడ్స్ 21” వెబ్ సిరీస్ నటీనటులు పృథ్వీ(చైతన్యరావ్), మేఘన(అనన్య)లు వచ్చి స్పెషల్ స్కిట్‌తో సందడి చేశారు. అయితే ఈ ఫుల్ టూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ కాకుడదంటే ఈ శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను చూసేయాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :