త్వరలో డిజిటల్ ప్రీమియర్ గా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”

త్వరలో డిజిటల్ ప్రీమియర్ గా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”

Published on Jan 9, 2024 8:59 PM IST

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ట్ మూవీస్ మరియు రుచిర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ చిత్రం త్వరలో ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు