టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”

టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”

Published on Mar 3, 2024 10:02 PM IST

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ మరియు రుచిర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రెడీ అయిపోయింది. వచ్చే ఆదివారం సాయంత్రం 6:00 గంటలకి స్టార్ మా లో ప్రసారం కానుంది. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు