నైజాంలో “ఎఫ్ 3” ఫస్ట్ డే వసూళ్ల వివరాలు.!

Published on May 28, 2022 1:04 pm IST

మన తెలుగు సినిమా నుంచి మంచి అంచనాలు మరియు ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రం “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో తోనే సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది.

అయితే గతంలో ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన “ఎఫ్ 2” బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ అయ్యిందో ఈ సారి కూడా అదే బాక్సాఫీస్ మంత్ర రిపీట్ అవుతుంది అని మేకర్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు. మరి వాటిని నిజం చేస్తూ ఈ సినిమా నైజాం లో ఫస్ట్ డే అదరగొట్టింది.

మరి ఈ సినిమా ఫస్ట్ డే అక్కడ 4.06 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించగా సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటించింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంకి దిల్ రాజు నిర్మాణం వహించాడు.

సంబంధిత సమాచారం :