“ఎఫ్ 3” తో యూఎస్ లో అదరగొడుతున్న సమ్మర్ సోగ్గాళ్ళు..!

Published on May 29, 2022 8:00 am IST


విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లీజ్ హీరోయిన్ లుగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “ఎఫ్ 3”. తమ హిట్ సినిమా ఎఫ్ 2 కి కొనసాగింపు గా ఆ ఫ్రాంచైజ్ నుంచి సరికొత్తగా తెరకెక్కించిన ఈ సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగా సాలిడ్ వసూళ్లను అందుకొని అసరగొడుతుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ నెంబర్ ని నమోదు చేసిన ఈ చిత్రం యూఎస్ లో అయితే సూపర్ సాలిడ్ గా ఉందని చెప్పాలి.

లేటెస్ట్ గా ఈ సినిమా అక్కడ ఏకంగా 7 లక్షల 50 వేల డాలర్లు మార్క్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. కేవలం ఈ రెండు రోజుల్లోనే ఈ మార్క్ టచ్ అవ్వడం విశేషం. దీని బట్టి ఓవర్సీస్ లో ఈ సినిమా సూపర్ అని అందరికీ క్లియర్ గా అర్థం అయ్యిపోయింది. ఇక ఈ సినిమాలో సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అలాగే దిల్ రాజ్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :