‘ఎఫ్ 2’, ‘మిస్టర్ మజ్ను’ యూఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 28, 2019 11:35 am IST

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రెవిన్యూని రాబడుతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ చిత్రం యూఎస్ లో కూడా మంచి రెవిన్యూ రాబడుతూ శనివారం నాటికీ $ 2 మిలియన్ల మైలురాయిని అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఆదివారం రాత్రి పది గంటల వరకు 74 స్థానాల్లో $ 38,046 లను రాబట్టింది. కాగా లేటెస్ట్ యూఎస్ గ్రాస్ ప్రకారం ‘ఎఫ్ 2’ $ 2,045,264 లను రాబట్టి ఉంది.

ఇంకొ వైపు, వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్మజ్ను’. భారీ అంచనాలు మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తానికి మజ్ను కలెక్షన్స్ మాత్రం యూఎస్ పంపిణీదారులకు ఆందోళన కలిగిస్తుంది. ఆ చిత్రం ఆదివారం రాత్రి పది గంటల వరకు 120 స్థానాల్లో $ 17,806 వసూలు మాత్రమే రాబట్టిగలిగింది. మిస్టర్ మజ్ను మొత్తం మూడు రోజులకు గానూ $ 198,033 కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం యూఎస్ లో బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే $ 1 మిలియన్ కలెక్ట్ చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :