2 మిలియన్ల క్లబ్ లో ఎఫ్ 2 !

Published on Jan 27, 2019 10:28 am IST

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 2 యూఎస్ఏ లో 2మిలియన్ల క్లబ్ లో చేరింది. దాంతో టాలీవుడ్ నుండి ఈ ఫీట్ సాధించిన 14వ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈచిత్రం. అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచి మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం అటు ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి మంచి వసూళ్లను రాబడుతూ బాక్సాఫిస్ వద్ద హావ కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 14 రోజుల్లోనే ఈచిత్రం 66 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక ఈచిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోనే అత్యధిక లాభాలను తీసుకువచ్చిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. తమన్నా ,మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :