‘ఎఫ్ 2’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

Published on Jan 17, 2019 12:24 pm IST

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

కాగా ఈ చిత్రం మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రెవిన్యూని రాబడుతుంది. విడుదలైన 5వ రోజు కూడా ఎఫ్ 2 నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. 5వ రోజుకు గానూ నైజాంలో ఎఫ్ 2 1.90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటికే ముప్పై కోట్ల మార్క్ ను దాటిన ఈ చిత్రం.. ఈజీగా ఏభై కోట్లను క్రాస్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

X
More