మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఎఫ్ 2’ !

Published on Jul 21, 2018 1:04 pm IST


ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సీనియర్ హీరో విక్టరీ ‘వెంకటేశ్‌ , మెగా హీరో వ‌రుణ్ తేజ్ ల కలయికలో హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ ట్యాగ్ లైన్‌ . కొద్దీ రోజులక్రితం మొదలైన ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది.

ఈ షెడ్యూల్ హీరోల తో పాటు కథనాయికలు తమన్నా , మెహ్రీన్ లు పాల్గొన్నారు . ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కామెడీతో పాటు మంచి మెసేజ్ తో రానున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :