ఆగష్టు నుండి మొదలుకానున్న ‘ఎఫ్ 3’

Published on Mar 25, 2020 12:00 am IST

అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. గతేడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ‘ఎఫ్ 3’ రూపొందిస్తామని అప్పుడే అనౌన్స్ చేశారు అనిల్. ఇందులో కూడా వెంకీ, వరుణ్ తేజ్ నటించనున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నారట.

ఈ చిత్రాన్ని ఆగష్టు నెల నుండి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. నిర్మాత దిల్ రాజు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని వినికిడి. ప్రజెంట్ వెంక్కీ ‘నారప్ప’తో బిజీగా ఉండగా వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆగష్టు సమయానికి పూర్తవుతాయట. వీటి తర్వాత చేయడానికి వరుణ్, వెంకీలు ఇంకా వేరే కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు. అందుకే అదే సమయానికి ‘ఎఫ్ 3’ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు, అనిల్ రావిపూడి.

సంబంధిత సమాచారం :

More