“పుష్ప” కి అప్పుడు ఎంట్రీ ఇస్తానంటున్న ఫహద్.!

Published on Jul 21, 2021 8:25 pm IST

స్టైలిష్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ ల కాంబోలో భారీ చిత్రం “పుష్ప” తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చెయ్యగా వాటిలో మొదటి భాగం ఇప్పుడు ఫైనల్ స్టేజి లోకి చేరుతుంది. అయితే గత కొన్ని రోజులు కితమే హైదరాబాద్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. కానీ ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఈ షూట్ మరింత ఆలస్యంగా పూర్తి కానుంది అని తెలిసింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రంలో సాలిడ్ రోల్ లో మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. మరి ఫహద్ తన రోల్ కి గాను ఎప్పుడు నుంచి ఎంట్రీ ఇవ్వనున్నాడో ఇప్పుడు తెలుస్తుంది. తాను వచ్చే ఆగష్టు నాటి నుంచి ఈ చిత్రం షూట్ లో పాల్గొననున్నాడట.

దాని తర్వాత విశ్వ నటుడు కమల్ తో చేస్తున్న “విక్రమ్” ను స్టార్ట్ చేయనున్నాడట. ఫహద్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో వస్తాడని ఒక రూమర్ ఉన్న సంగతి తెలిసిందే. మరి బహుశా ఆ సన్నివేశాల ఫహద్ ఈ క్లైమాక్స్ షూట్ లో ఎంటర్ కానున్నాడేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :