మెయిన్ లీడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఫహద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీ.!

మెయిన్ లీడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఫహద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీ.!

Published on Mar 19, 2024 3:39 PM IST


మన సౌత్ ఇండియా సినిమా దగ్గర అపారమైన టాలెంట్ కలిగిన నటుల్లో ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కూడా ఒకరు. మరి “పుష్ప” (Pushpa), “విక్రమ్” చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యిన తాను ఇప్పుడు టాలీవుడ్ డెబ్యూ అది కూడా మెయిన్ లీడ్ లో ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ శోబు యార్లగడ్డ నిర్మాణంలో ఇప్పుడు 2 ప్రాజెక్ట్ లు అనౌన్స్ అయ్యాయి. మరి ఓ చిత్రానికి మేకర్స్ ఇంట్రెస్టింగ్ టైటిల్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రివీల్ చేశారు. మరి ఈ చిత్రానికి బాలయ్య (Balakrishna) ఫేమస్ డైలాగ్ “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” అంటూ ఒక ఫాంటసీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఫహద్ ఫాజిల్ ఓ చిన్నారితో పోలీస్ కార్ పై ఉన్నట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇందులో ఆ పాప ఓ మ్యాజిక్ పెన్సిల్ తో మాయాజాలం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీటితో అయితే ఓ ఇంట్రెస్టింగ్ ఎంటెర్టైనర్ నే వారు తీసుకొస్తున్నారని అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కించనుండగా దీనిని పాన్ సౌత్ భాషల్లో అనౌన్స్ చేశారు. ఈ జూన్ నుంచి షూటింగ్ మొదలు కానుండగా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్టుగా ఇందులో కన్ఫర్మ్ చేశారు.

ఇక రెండో సినిమాని అయితే “ఆక్సిజన్” అంటూ మరో కొత్త దర్శకుడు సిద్ధార్థ్ నాదెళ్లని పరిచయం చేస్తూ రివీల్ చేశారు. దీనితో ఈ యంగ్ టాలెంట్ ని అందులోని విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ తో కలిసి పని చేయనుండడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత శోబు యార్లగడ్డ ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు