నాగ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురుచూపులు

Published on Jul 27, 2019 12:01 am IST

ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే హీరోల్లో అక్కినేని నాగర్జున కూడా ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎంత సంబరపడతారో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంతే సంబరపడతారు. కానీ కొన్నాళ్ళుగా ఆ పరిస్తితి లేదు. ‘సొగ్గాడే చిన్ని నాయన’ తర్వాత కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే సినిమాలేవీ నాగ్ చేయలేదు. మల్టీస్టారర్, ప్రయోగాత్మక చిత్రాలు అంటూ భిన్నమైన ప్రయత్నాలు చేశారు. వాటి రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యామిలీ ప్రేక్షక వర్గానికి మాత్రం నాగ్ నుండి కావల్సిన స్టఫ్ దొరకలేదు.

అలాంటి వాళ్లకు చాన్నాళ్ల తర్వాత నాగ్ నుండి ఫుల్ మీల్ లాంటి సినిమా ‘మన్మథుడు 2’ వస్తోంది. ఇది మల్టీస్టారర్ కాదు, ప్రయోగలు అసలే లేవు. నాగ్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాంటి సినిమాను ఆశిస్తారో అలాంటి సినిమానే ఇది. రొమాన్స్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స, మంచి పాటలు, నాగ్ ఛార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇలా వారికి కావల్సినవన్నీ ఉన్నాయి. అందుకే నాగ్ గత మూడు చిత్రాలకు లేని క్రేజ్ ఈ చిత్రానికి ఉంది. ఆగష్టు 9న విడుదలకానున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో రకుల్ ప్రీత్ ప్రధాన కథానాయకి కాగా సమంత, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :