“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న సుహస్..!

Published on Jul 20, 2021 12:49 pm IST

సుహస్ హీరోగా మెహర్ తేజ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రం లో సుహస్ రామ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. పూజా కిరణ్, శృతి నోరీ ఫిమేల్ లీడ్ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాష్మ ఫిలిమ్స్ మరియు నూతన భారతి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి అజయ్ సంజయ్ లు సంగీతం అందిస్తున్నారు. అయితే విడుదల అయిన ఫస్ట్ లుక్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :