శ్రీనివాస కళ్యాణం లో తన పాత్రంటే చెప్పిన ప్రముఖ నటి !
Published on Aug 3, 2018 6:32 pm IST

యువ హీరో నితిన్ , రాశి ఖన్నా జంటగా ‘శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’ .శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రం ఈనెల 9న విడుదలకు సిద్ధమైంది.

ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఎక్కడికిపోతావ్ చిన్నవాడా ఫెమ్ నందిత శ్వేతా. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈచిత్రం లో తతన పాత్ర గురించి చెప్పింది. ఈసినిమాలో పద్మావతీ అనే పాత్రలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. తప్పకుండ ఈపాత్ర అందరికి కనెక్ట్ అవుతుందని ఆమె తెలియజేశారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈచిత్రం యొక్క ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook