అందరి ప్రార్థనల వలన.. నేను బాగున్నాను !

Published on May 5, 2019 6:34 pm IST

ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఎస్.జానకి ఇటీవలే మైసూరులోని తన బంధువుల దగ్గరకు వెళ్లగా.. అక్కడ ఆమె ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. వెంటనే బంధువులు ఆమెను హుటాహుటిని హాస్పటల్ లో జాయిన్ చేయగా, పరీక్షించిన వైద్యులు ఆమె తుంటి ఎముకకు గాయమైనట్లు నిర్దారించారు. ఆమెకు చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది.

కాగా డిస్చార్జ్ అవుతూ మీడియాతో మాట్లాడిన జానకి అందరి ప్రార్థనల వలన తాను బాగున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. ఆమె ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో పాడారు.

పైగా ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారాలను అందుకున్నారు.

సంబంధిత సమాచారం :

More