మహేశ్ బాబు ‘ఫ్యాన్స్ డే’ వచ్చేసింది !

Published on Mar 24, 2019 10:41 pm IST

మొత్తానికి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని రేపు హైదరాబాద్ తీసుకురానున్నారు. హైదరాబాద్ లోని ‘ఏ ఎమ్ బి’ సినిమాస్ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

రేపు సాయంత్రం వరకూ విగ్రహాన్ని ‘ఏ ఎమ్ బి’ సినిమాస్ లోనే ఉంచుతారు. ఆ తరువాత ఆ విగ్రహాన్ని సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలోకి తరలించి ఇక అక్కడే ప్రదర్శిస్తారు. రేపు మాత్రం ‘ఏ ఎమ్ బి’ సినిమాస్ థియేటర్లల్లో మహేశ్ అభిమానులు సందడి చేయనున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో ఒక్క మహేష్ బాబుకు మాత్రమే ఈ గౌరవం దక్కడంతో సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సంబంధిత సమాచారం :

X
More