అందరి దృష్టి రామ్ చరణ్ మీదే !


ఇంకొద్ది రోజుల్లో విడుదలకానున్న భారీ చిత్రం ‘రంగస్థలం’. దాదాపు ఏడాది పాటు రామ్ చరణ్, సుకుమార్, ఇతర టీమ్ అంతా కష్టపడి చేసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. విడుదలైన టీజర్, ట్రైలర్లలో కూడ చిత్రంలో బలమైన కథ, పాత్రలు ఉంటాయని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ముఖ్యంగా రామ్ చరణ్ చేస్తున్న చిట్టి బాబు పాత్ర అయితే సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సుకుమార్, కథానాయిక సమంత, నిర్మాతలు, ఇతర చిత్ర యూనిట్ ఈ సినిమాలో చరణ్ లోని పూర్తిస్థాయి నటుడ్ని చూస్తారని, ఈ పాత్ర, అందులో ఆయన పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయని అంటున్నారు.

చరణ్ కూడ ఈ సినిమా తనపై తనకే గౌరవాన్ని పెంచిందని ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు. అందరూ ఇంతలా పొగుడుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు చిట్టి బాబు పాత్రలో చరణ్ నటనను చూడాలి తొందరపడిపోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలకానుంది.