“సర్పట్ట పరంబరై” కోసం ఎదురు చూస్తున్న అభిమానులు!

Published on Jul 21, 2021 10:12 pm IST

ఆర్య హీరోగా పా రంజిత్ దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్పట్ట పరంబరై. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కి సిద్దం అయింది. జూలై 22 న ప్రైమ్ విడియో ద్వారా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటం తో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తమిళం లో పాటుగా తెలుగు లో కూడా విడుదల కానుంది. అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నేడు రాత్రి 12 గంటలకు విడుదల కి సిద్దం అయింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :