చరణ్ కోసం విక్రమ్ కుమార్ స్టైల్ మార్చుకుంటారా ?

Published on Feb 26, 2020 10:33 pm IST

‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్నట్టు ప్రకటించేశారు. దీంతో రామ్ చరణ్ సినిమా ఏమిటనే విషయమై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. నిజానికి చరణ్ గతంలోనే విక్రమ్ కుమార్ సినిమా చేయాల్సింది. కానీ రాజమౌళి సినిమాకు కమిటవ్వడంతో చేయలేకపోయారు. ఇప్పుడు ఆ కథనే వర్కవుట్ చేయాలని అనుకుంటున్నారట.

అయితే విక్రమ్ కుమార్ శైలికి చరణ్ మాస్ ఇమేజ్ కు సెట్టవుతుందా లేదా అనే అనుమానం కలుగుతోంది అభిమానుల్లో. ఎందుకంటే విక్రమ్ గత సినిమాలు ‘మనం, 24, గ్యాంగ్ లీడర్, 13 బి, ఇష్క్’ అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ లేదా లవ్ స్టోరీలే. మరి ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ను ఆయన ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి విక్రమ్ కుమార్ చరణ్ ను తనదైన క్లాస్ కథలోనే చూపుతారా లేకపోతే శైలి మార్చి కమర్షియల్ జానర్లో సినిమా చేస్తారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More