Peddi: లీక్ తో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్.. కానీ!

Peddi: లీక్ తో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్.. కానీ!

Published on Dec 21, 2025 4:00 PM IST

Peddi Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాతో మెగా అభిమానులు మరో బిగ్గెస్ట్ కొట్టబోతున్నామని ధీమాగా ఉన్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రతీ కంటెంట్ కూడా సాలిడ్ హిట్ అవుతూ పాన్ వరల్డ్ లెవెల్లో మంచి రీచ్ ని సొంతం చేసుకుంటున్నాయి. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి కొన్ని లీక్స్ బయటకి రావడం ఫ్యాన్స్ ని ఎగ్జైటింగ్ గా మార్చేశాయి.

రీసెంట్ గానే రామ్ చరణ్ అండ్ కో ఢిల్లీ షెడ్యూల్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ షూట్ నుంచి రామ్ చరణ్ పై కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారాయి. దీనితో ఇందులో రామ్ చరణ్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ రేంజ్ లో షూట్ లీక్స్ బయటకి రావడం అనేది సినిమాకే మంచిది కాదు అని మరికొందరు జెన్యూన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి వీటిపై మేకర్స్ నే కేర్ తీసుకోవాల్సి ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు