మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాంఛ్ ఆరోజేనా..

Published on May 27, 2021 3:00 am IST

సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు వస్తుందంటే మహేష్ బాబు సినిమాల మీద అప్డేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందుకే మే 31న మహేష్ అభిమానులకు ట్రీట్ లాంటిది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఏదో ఒకటి ఉంటుంది. ఇన్ సైడ్ టాక్ మేరకు ప్రచార చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మహేష్ సైన్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి సంబంధించిన విశేషం కూడ ఉంటుందని అంటున్నారు.

మే 31న చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు టైటిల్ రివీల్ చేస్తారని లేకపోతే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు చెబుతారని టాక్ వినిపిస్తోంది. అభిమానులు సైతం అదే ఆశిస్తున్నారు. ఇకపోతే హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గతంలో మహేష్, త్రివిక్రమ్ కలయికలో ‘అతడు, ఖలేజా’ లాంటి సినిమాలు వచ్చి ఉండటంతో ఈసారి చేయబోయే సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంబంధిత సమాచారం :