నాని ఇచ్చిన సప్రైజ్ చాలా బాగుంది!
Published on Feb 23, 2017 4:37 pm IST


నాని మరోసారి తన అభిమానులకు మంచి సప్రైజ్ ఇచ్చాడు. నిన్న చెప్పినట్టే కొద్దిసేపటి క్రితమే నాని తను నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్లో చేస్తున్న కొత్త చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఆ ఫస్ట్ లుక్ లోనే సినిమా టైటిల్ ‘నిన్ను కోరి’ అని కూడా తెలుస్తోంది. నాని అభిమానులు అతని నుండి ఎలాంటి సినిమాలను కోరుకుంటారో అలానే ఉన్నాయి ఫస్ట్ లుక్, టైటిల్. రొమాంటిక్ ఫీల్ పుష్కలంగా ఉట్టిపడుతున్న ఈ పోస్టర్ లో నాని లుక్ కూడా కొత్తగా ఉండి బాగా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం యూఎస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నివేతా థామస్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జెంటిల్మెన్’ చిత్రం మంచి విజయం సాధించడంతో వీరిద్దరి జంట బాగా పాపులర్ అయింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో నటుడు ఆది ఒక కీ రోల్ పోషిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

 
Like us on Facebook