పవన్ మేకోవర్ చూసి ముచ్చటపడుతున్న అభిమానులు!
Published on Nov 12, 2017 11:37 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే స్టైల్ కి పర్యాయపదమని చెప్పొచ్చు. ఆయన సినిమాల నుండి అభిమానులు ఎక్కువగా కోరుకునేది కూడా సరికొత్త తరహా స్టైల్ నే. అందుకే పవన్ తో సినిమాలు తీసే దర్శకులంతా పవన్ ను స్క్రీన్ మీద వీలైనంత స్టైలిష్ గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ప్రసుతం వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం యూరప్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ చిత్రీకరణకు సంబందించిన కొన్ని లొకేషన్ పిక్స్ నిన్న బయటికొచ్చాయి. వాటిలో పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో చాలా క్లాసీగా కనిపిస్తున్నారు. వాటిని చూసిన అభిమానులు సినిమాలో తాము పవన్ ను ఏ విధంగా చూడాలనుకుంటున్నామో త్రివిక్రమ్ అలానే చూపెడుతున్నారని తెగ ముచ్చటపడిపోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న సంక్రాతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో పవన్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు నటిస్తున్నారు.

 
Like us on Facebook