దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతూ వచ్చిన చిరంజీవి, చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ బ్రూస్ లీ సినిమాతో తెరపై దర్శనమివ్వనున్న విషయం తెలిసిందే. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందిన ‘బ్రూస్ లీ’ సినిమా ఈ సీజన్‌కు భారీ అంచనాల మధ్య వస్తోన్న అతిపెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. చిరు ఓ గెస్ట్ రోల్ చేయనున్నారన్న ఒక ప్రధాన అంశం ఈ సినిమాపై అప్పటికే విపరీతంగా ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది.
ఇక ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందే, అంటే గురువారం అర్థరాత్రి ఏర్పాటు చేసిన బెనిఫిట్ షో కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏళ్ళ తర్వాత తమ అభిమాన హీరోను తెరపై చూసి ఆనందించడానికి సిద్ధమవుతున్నారు. బ్రూస్ లీలో సుమారు 5 నిమిషాల పాటు ఉండనున్న చిరు గెస్ట్ రోల్‌పై బ్రూస్ లీ టీమ్ బాగా ప్రచారం చేస్తూ వస్తోంది. చిరు గెస్ట్ రోల్ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని దర్శకుడు శ్రీనువైట్ల చెబుతూ వస్తున్నారు. ట్రైలర్, ఆడియోతో కట్టిపడేసిన ఈ సినిమా దసరా సీజన్‌కు వస్తోన్న పర్ఫెక్ట్ పండగ లాంటి సినిమా ఇదని, ఈ సినిమా తప్పక మంచి విజయం సాధిస్తుందని రామ్ చరణ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.


