చిరు చెప్పిన 60 ఏళ్ల క్రితం స్టోరీ అందరినీ ఆశ్చర్యపరిచింది

Published on Nov 18, 2019 2:10 pm IST

మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు తన జీవిత విశేషాలని చాలా ఆసక్తిగా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే నిన్న జరిగిన ఏఎన్నార్ అవార్డ్స్ వేడుకకు హాజరైన ఆయన తాను పుట్టకముందు, ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘటనను వేదిక మీద షేర్ చేసుకున్నారు. అది ఒక పల్లెటూరు అంటూ స్టార్ట్ చేసిన ఆయన ‘అప్పుడే కొత్తగా పెళ్లైన జంట. ఆమె గర్భవతి, పూర్తిగా నెలలు నిండాయి. అదే సమయానికి తన అభిమాన నటుడి సినిమా విడుదలైంది. సినిమా చూపించాలని తన భర్తను కోరింది. తప్పక భార్య కోరికని ఒప్పుకొన్నాడు. ఆరు కిలోమీటర్ల పక్కన ఉన్న టౌన్‌కు గతుకుల రోడ్డు మీద బయలుదేరారు. గుర్రంపైన వెళ్తుంటే మార్గ మధ్యంలో ప్రమాదం జరిగింది అని ఒక్క క్షణం విరామం ఇచ్చారు.

మళ్లీ అందుకుని భర్త భయపడ్డాడు. ఎవరికీ ఏమీ కాలేదు. ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అని భర్త అన్నాడు భర్త. ఆమె ఒప్పుకోలేదు. కష్టం మీద హాలుకి వెళ్లి అభిమాన నటుడి సినిమాను ఆమె ఎంతో సంతోషంగా చూసింది. ఈ కథలో ఆ గర్భిణి స మా అమ్మ అంజనా దేవి. అది 1955వ సంవత్సరం. ఊరు మొగల్తూరు. ఆ సినిమా ‘రోజులు మారాయి’. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావుగారు అంటూ కథ ముగించారు. ఆయన మాటలు విన్న అభిమానులు చిరు జీవితంలో జరిగిన ఇంతటి ముఖ్యమైన ఘటన మనకు ఇన్నాళ్లు తెలియదే అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More