తెలుగు హీరోలు వెర్సెస్ తమిళ హీరోలు..మితిమీరుతున్న ట్రోల్స్

Published on Jan 23, 2020 12:00 am IST

దక్షిణాది సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ కామన్. ఇన్నాళ్ళు కేవలం హీరోల అభిమానుల మధ్యనే నడిచిన ఈ ఫైట్ ఇప్పుడు ఇండస్ట్రీల మధ్యకు వచ్చేసింది. నిన్నటి నుండి తమిళ హీరోల అభిమానులు, తెలుగు హీరోల అభిమానులు అదే పనిగా ఒకరి మీద ఒకరు విపరీతమైన ట్రోలింగ్స్ చేసుకుంటున్నారు.

నిన్న సీనియర్ హీరో వెంకటేష్ చేస్తున్న ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. అవి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కానీ కొందరు తమిళ సినీ అభిమానులు మాత్రం వాటిపై విమర్శలు స్టార్ట్ చేశారు. దీంతో తెలుగు అభిమానులు తమిళ స్టార్ హీరోలు తెలుగు సినిమాలను బేస్ చేసుకుని చేసిన రీమేక్ చిత్రాలను ప్రస్తావిస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

ఈ అనవసర వివాదంలోకి మహేష్, విజయ్, పవన్, అజిత్, ప్రభాస్, ధనుష్ ఇలా స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇన్వాల్వ్ కావడంతో అది కాస్త ముదిరిపోయింది. ఎన్నాళ్ళ నుండో తెలుగు మార్కెట్లోకి ప్రవేశించాలని తమిళ హీరోలు, ఇప్పుడిప్పుడే తమిళ మార్కెట్ మీద తెలుగు హీరోలు దృష్టి పెడుతున్న తరుణంలో ఈ వివాదం రాజుకోవడం రెండు పరిశ్రమల హీరోలకి మంచి పరిణామం అనిపించుకోదు.

సంబంధిత సమాచారం :

X
More