అఖిల్ 3లో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకుంటున్నారట !

అఖిల్ 3లో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకుంటున్నారట !

Published on Jul 17, 2018 9:09 PM IST

‘తొలి ప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్ర షూటింగ్ ప్రస్తుతం లండన్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లో నర్తించడానికి ఫరా కరిమయి ను తీసుకోవాలని భావిస్తున్నాడట చిత్ర డైరెక్టర్ . ఇంతకుముందు ఆమె తెలుగులో’ధ్రువ’ చిత్రంలో అరవింద స్వామి ప్రియురాలుగా అలాగే ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంలో గ్రీస్ యువరాణి పాత్రలో నటించారు. ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది .

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘అఖిల్ , హలో’ చిత్రాల తరువాత అఖిల్ నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు